నాగర్ కర్నూల్ (ఎస్ బి న్యూస్), అక్టోబర్ 23:
కార్తీకమాస ఆరంభం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని శ్రీశైల ఉత్తరద్వారం గావెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం ఆంజనేయ స్వామి మాలాధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం మాలాధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
ఈ సందర్భంగా నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ, మల్లేపల్లి, సాగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. స్వాములు మాలధారణ అనంతరం కొండపై శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీమాలా ధారణ కార్యక్రమం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలక మండలి సభ్యులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి, వెలుతురు, స్నానాల వంటి సదుపాయాలు సక్రమంగా అందుబాటులో ఉంచారు.
Social Plugin