ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన నేతలకు
ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ చేతులమీదుగా సన్మానం
నాగర్ కర్నూల్,నవంబర్ 10(ఎస్ బి న్యూస్),: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలో ని అమ్రాబాద్, మేజర్ గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భం లో కాంగ్రెస్ పార్టీ నేతలుఐక్యమత్యంతో సర్పంచ్‌తో పాటు 14 వార్డులు ఏకగ్రీవంగాఎన్నుకోబడ్డాయి. పార్టీ శ్రేణులు ఈ ఐక్యత, ప్రజా హితం కోసం తీసుకున్న నిర్ణయానికి గుర్తింపుగా ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ స్వయంగా హాజరై స్థానిక నేతలను ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అమ్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చూపిన ఏకగ్రీవ నిర్ణయం ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తోందని, ప్రజా సేవలో ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్, వార్డు సభ్యుల కు మరింత బాధ్యతను పెంచిందని ఆయన అభినందించారు.
సన్మాన కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ఓటరుగా మరియు లీడర్‌గా మీరు కూడా ఎమ్మెల్యే చేతులమీదుగా ఎస్సీ సెల్ తాలూకా అద్యక్షులు చింతల రాజగోపాల్ ను సన్మానం చేశారు. స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Social Plugin