కళ్లముందే జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల భక్తులు షాక్కు గురయ్యారు.
మేడారం జంపన్నవాగులో స్నానం కోసం దిగిన ఓ భక్తుడు నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జాతరలో పాల్గొన్న భక్తుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.మంచిర్యాల జిల్లాకు చెందిన కిరణ్ (45) అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమ్మవార్ల దర్శనానికి మేడారం వచ్చాడు.జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించేందుకు వాగులోకి దిగిన సమయంలో నీటిలో గల్లంతయ్యాడు.
