సింగరేణి, జూలై 12: సింగరేణి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన వాంకుడోత్ కౌలియా నాయక్ను సీపీఐ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని బాధ్యతలు అప్పగించారు.గత 30 సంవత్సరాలుగా సీపీఐ పార్టీలో నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించిన ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న నాయకులు ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాలుగా ఒకే పార్టీలో కొనసాగుతూ సేవలందించడం అరుదైన విషయమని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి వాంకుడోత్ కౌలియా నాయక్‌ను సన్మానించి గ్రామ శాఖ కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాంకుడోత్ కౌలియా నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ శాఖ కార్యదర్శిగా ఎన్నుకున్న జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యదర్శి, మండల కార్యవర్గ సభ్యులు, పార్టీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
0 కామెంట్‌లు