కమిషనర్ నిర్లక్ష్యమే కారణం.. వెంటనే బదిలీ చేయాలని డిమాండ్
డోన్: డోన్ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ నిర్లక్ష్యం, మొండి వైఖరే కారణమని సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కీ శ్రీకాంత్ విమర్శించారు.ఆదివారం సీపీఎం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, నెలకు రెండు, మూడు సార్లు తాగునీటి సరఫరా నిలిపివేస్తూ ప్రకటనలు చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. వర్షాకాలంలోనూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడటం మున్సిపల్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.పట్టణ ప్రజలకు నిరంతరాయంగా మంచినీరు అందించడంలో కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని కమిషనర్‌ను బదిలీ చేసి, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.తాగునీటి సమస్యతో పాటు మున్సిపల్ సేవల లోపాల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రామాంజనేయులు, చిన్న రహిమాన్, షేమిమ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు