నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం చెన్నారం గ్రామంలో వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బల్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు తెల్కపల్లి మండలం గట్టురవిపాకల గ్రామానికి చెందిన గౌని శేఖర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్–69 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్న శేఖర్ వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కొనసాగించాడని, అనంతరం మరో మహిళను వివాహం చేసుకున్నట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
0 కామెంట్‌లు