కారేపల్లి రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం ఆకస్మిక తనిఖీ.. ప్రయాణికుల సమస్యలపై ఆరా
దక్షిణ మధ్య రైల్వే డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డా. గోపాలకృష్ణ మంగళవారం ప్రత్యేక రైలులో కారేపల్లి రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ నిర్వహణను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అనంతరం రెండో రైల్వే లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. డోర్నకల్–భద్రాద్రి కొత్తగూడెం మధ్య కరోనా సమయంలో నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని డీఆర్‌ఎం హామీ ఇచ్చారు.
#SBNEWS #Karepalli #Railway #DRM #SouthCentralRailway #BhadradriKothagudem #TelanganaNews
0 కామెంట్‌లు