భూమి హద్దుల స్పష్టతకు కలవల నాగారంలో రీ సర్వే ప్రారంభం


కరకగూడెం మండలం కలవల నాగారంలో భూమి హద్దులపై స్పష్టత తీసుకురావడంతో పాటు భూ వివాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామంలో సర్వేయర్లు ఆధునిక పరికరాల సహాయంతో భూముల కొలతలు చేపట్టి హద్దులను నిర్ధారిస్తున్నారు. రైతులు, భూ యజమానులు సహకరించి అవసరమైన పత్రాలను అందించాలని అధికారులు సూచించారు. రీ సర్వేతో భూ రికార్డులు మరింత పారదర్శకంగా మారడంతో పాటు భవిష్యత్‌లో భూ వివాదాలకు చెక్ పడుతుందని అధికారులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు