బీసీ హాస్టల్‌లో ఉచిత ప్రవేశాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బీసీ హాస్టల్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పినపాక బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనుమండ్ల ప్రదీప్ రెడ్డి సూచించారు. ఆయన పినపాక మండల కేంద్రంలో గల బీసీ హాస్టల్ వద్ద శనివారం మాట్లాడారు.హాస్టళ్లలో ఉచిత వసతి, భోజనం, విద్యా సంబంధిత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మెరుగైన విద్యను అభ్యసించాలని ఆయన కోరారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పూర్తి వివరాల కోసం సంబంధిత బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సంప్రదించాలని సూచించారు. హాజరయ్యే విద్యార్థులు చదువుతున్న పాఠశాల స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంటు తో సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 9346026172 కు సంప్రదించాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు