📍 గుండాల మండలం, కొమ్ముగూడెం
గుండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో రైతు వాగబోయిన నరసింహారావు ఇంట్లో డ్రోన్ బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, నరసింహారావుతో పాటు మరో ఇద్దరు రైతులు ఎస్‌ఏజీ (SAG) కంపెనీకి చెందిన డ్రోన్‌ను అప్పు తీసుకుని సుమారు రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు.
డ్రోన్‌లో సాంకేతిక సమస్యలు ఉండటంతో బ్యాటరీని వేరుచేసి ఉదయం వరంగల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఉదయం 8:30 గంటల సమయంలో అకస్మాత్తుగా బ్యాటరీ నుంచి మంటలు వచ్చి పెద్ద శబ్దంతో పేలింది. దీంతో సమీపంలో ఉన్న డ్రోన్ చార్జర్‌కు కూడా మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.
మంటలు ఇంటి తలుపుకు కూడా అంటుకోవడంతో స్థానికులు అప్రమత్తంగా స్పందించి వెంటనే అగ్నిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో బ్యాటరీ (రూ.60,000) మరియు చార్జర్ (రూ.50,000) కలిపి మొత్తం రూ.1,10,000 నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు.
ఈ ప్రమాదంతో నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.
0 కామెంట్‌లు