పినపాక:చికిత్స నిర్వహిస్తున్న సమయంలో హిప్పో (నీటి ఏనుగు) అకస్మాత్తుగా దాడి చేయడంతో వెటర్నరీ డాక్టర్ సమీక్ష రెడ్డి మృతి చెందటం తీవ్ర విషాదకరమని పినపాక వెటర్నరీ వైద్యురాలు శిరీష, ఈ. బయ్యారం వెటర్నరీ వైద్యురాలు ఉజ్వల తెలిపారు.ఈ ఘటనపై వారు శనివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.జంతువులకు చికిత్స అందించే సమయంలో భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.డాక్టర్ సమీక్ష రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
0 కామెంట్‌లు