డీలిస్టింగ్‌కు వ్యతిరేకంగా గిరిజన సూర్యమంచ్ మహా గర్జన ర్యాలీ

డీలిస్టింగ్‌కు వ్యతిరేకంగా గిరిజన సూర్యమంచ్ మహా గర్జన ర్యాలీ
 స్వాతంత్ర్య భారత్ న్యూస్ దుమ్ముగూడెం ప్రతినిధి కాక చంద్రకళ 
తెలంగాణలో గిరిజన సూర్యమంచ్ ఆధ్వర్యంలో డీలిస్టింగ్‌కు వ్యతిరేకంగా మహా గర్జన ర్యాలీ ఢిల్లీలో నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. దుమ్ముగూడెం గ్రామంలో ఈ ర్యాలీ ప్రచారం నిర్వహించారు.ఈ నెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగంలోని షెడ్యూల్–2 నిబంధనలను అమలు చేయాలని, గిరిజనుల హక్కులను కాపాడాలని ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.1967 జూన్ 10న జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలను కూడా గుర్తు చేశారు.దేశంలో సుమారు 700కు పైగా ఉన్న గిరిజన తెగల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల జీవన విధానం,సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడేందుకు చట్టపరమైన రక్షణ అవసరమని పేర్కొన్నారు.
డీలిస్టింగ్ పేరుతో గిరిజనుల హక్కులను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఈ ర్యాలీ ద్వారా తమ స్వరాన్ని బలంగా వినిపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు