📍 మణుగూరు
మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో రెండవ యూనిట్‌లో బాయిలర్ పైపు లీక్ కారణంగా శనివారం విద్యుత్ ఉత్పత్తి అంతరాయం ఏర్పడింది. లీక్ గుర్తించిన వెంటనే అధికారులు యూనిట్‌ను నిలిపివేసి మరమ్మత్తు పనులు ప్రారంభించారు.
బాయిలర్ పైపులో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. మరమ్మత్తు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే యూనిట్‌ను తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంతరాయం వల్ల విద్యుత్ సరఫరాపై కొంత ప్రభావం పడినట్లు సమాచారం.
0 కామెంట్‌లు