రంజాన్ నేపథ్యంలో ఈద్ దర్గా పరిశీలన

రంజాన్ నేపథ్యంలో ఈద్ దర్గా పరిశీలన
రంజాన్ పండుగ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు మణుగూరు సింగరేణి ఏరియా పీవీ కాలనీలోని ఈద్ దర్గా ప్రాంతాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి సందర్శించారు.
ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ప్రదేశంలో అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, జనసమ్మర్థం నివారణ వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు