భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు–పినపాక సరిహద్దులో ఉన్న బీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై పొల్యూషన్ బోర్డు కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు రహదారుల ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సమర్థవంతమైన చర్యగా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మణుగూరు నుంచి జానంపేట వరకు, ఈ బయ్యారం నుంచి తోగూడెం వరకు, అలాగే ఇతర గ్రామాల ప్రధాన రహదారుల వెంట పండ్ల మొక్కలు, నీడనిచ్చే వృక్షాలను నాటితే దుమ్ము, గాలిలోని కాలుష్య కణాలను కొంతవరకు అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు, వన్యప్రాణులకు కూడా మేలు జరుగుతుంది.బీటీపీఎస్ సంస్థ తన సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా వేల సంఖ్యలో మొక్కలు పంపిణీ చేసి, వాటి సంరక్షణకు చర్యలు చేపడితే ఈ ప్రాంతం క్రమంగా పచ్చదనంతో కళకళలాడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా బీటీపీఎస్ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు విస్తృత స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
0 కామెంట్‌లు