భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గలబా గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన సింగిల్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనాల ప్రయాణికులు నిత్యం ప్రమాద భయంతో ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్నారు. ఇదే మార్గంలో ఇల్లందుకు రోజుకు రెండుసార్లు ఆర్టీసీ బస్సు కూడా నడుస్తుండటంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదాలు చోటుచేసుకునే ముందే సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది.
#SBNEWS #Galaba #Gundala #BhadradriKothagudem #RoadDamage #RoadSafety #RTC #Yellandu #TelanganaNews #LocalNews
0 కామెంట్‌లు