కొండాపురం అండర్‌గ్రౌండ్ గనిలో ఇద్దరు కార్మికులకు అస్వస్థత.. ఏరియా ఆసుపత్రికి తరలింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ప్రాంతంలోని కొండాపురం అండర్‌గ్రౌండ్ గనిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు శనివారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గమనించిన తోటి కార్మికులు గనిలోనే ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని వెంటనే మణుగూరు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం మందేలా చూడాలని వైద్యులతో మాట్లాడారు
#SBNEWS #Manuguru #Singareni #KondapuramMine #CoalMine #Workers #TBGKS #BhadradriKothagudem #TelanganaNews #LocalNews
0 కామెంట్‌లు