భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలకు స్పష్టమైన గుర్తింపు కల్పించేందుకు గ్రామాల పేర్లతో నూతన బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నూపా బాపనమ్మ మాట్లాడుతూ గ్రామాల ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ఈ బోర్డులు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు గ్రామాలను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు గ్రామాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కూడా స్థానిక సంస్థల బాధ్యతేనని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ అధికారులు, అత్యవసర సేవల సిబ్బంది, సందర్శకులు సరైన గ్రామాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.
గ్రామస్థులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ, గ్రామాలకు గుర్తింపు కల్పించే చర్యలు అభినందనీయమని తెలిపారు. ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ తెలిపారు.
0 కామెంట్‌లు