చింతిర్యాల పంచాయతీ భవన ప్రారంభంపై వివాదం.. అధికారుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవాన్ని హడావుడిగా నిర్వహించడం అధికారుల అత్యుత్సాహానికి నిదర్శనమని సర్పంచ్ కొరసా అలివేలు, ఉపసర్పంచ్ వెన్న అశోక్‌కుమార్ విమర్శించారు. సర్పంచ్ ఆరోగ్యం బాగాలేదని కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రామపంచాయతీకి నిధులు ఇవ్వకుండా ప్రారంభోత్సవం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మండలంలోని అన్ని పంచాయతీలను సమానంగా చూసి నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో సర్పంచులు, ఉపసర్పంచులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
0 కామెంట్‌లు