సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారు: ఓరుగంటి రమేష్
సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హయాంలో తగిన నిధులు కేటాయించకుండా పనులను ఏళ్ల తరబడి సాగదీసి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని అశ్వాపురం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చొరవతో నిధులు విడుదల చేసి భూసేకరణ, ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారని అన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక కృషితో పినపాక నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సీతారామ ప్రాజెక్టు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని విమర్శించారు.
0 కామెంట్‌లు