ఈసం సారయ్య కుటుంబానికి తుడుం దెబ్బ అండగా ఉంటుంది
గుండాల మండలం ఆగస్టు 28 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
గుండాల మండలంలోని చీమలగూడెం గ్రామానికి చెందిన తుడుం దెబ్బ మండల సభ్యుడు ఈసం సారయ్య (పండు) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల తుడుం దెబ్బ నాయకులు, సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సారయ్య కుటుంబాన్ని పరామర్శించిన తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి వజ్జా ఎర్రయ్య, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా వజ్జా ఎర్రయ్య మాట్లాడుతూ.. ఈసం సారయ్య తుడుం దెబ్బ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేశారని అన్నారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. సారయ్య కుటుంబానికి తుడుం దెబ్బ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కష్టకాలంలో కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం నాయకులు సారయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగగూడెం సర్పంచ్ చింత వెంకటేశ్వర్లు, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సాంబయ్య, మండల అధ్యక్షులు గోవింద నర్సింహారావు మండల ప్రధాన కార్యదర్శి మొకాళ్ళ మహేందర్ దొర, సారయ్య, రవీందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని సారయ్యకు నివాళులర్పించారు.
0 కామెంట్‌లు