యువత రాజకీయాల్లోకి రావాలి: కాలసాని సంజయ్ రెడ్డి

యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కాలసాని సంజయ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమై మాట్లాడారు.ఈ సందర్భంగా కాలసాని సంజయ్ రెడ్డి మాట్లాడుతూ దేశం, రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత రాజకీయాలపై అవగాహన పెంచుకుని ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు రావాలని సూచించారు. రాజకీయాల్లో యువతకు మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ యువతను ప్రోత్సహిస్తూ వారికి నాయకత్వ అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంలో యువత ముందుండాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ విధానాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువజన కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో యువతను మరింతగా భాగస్వామ్యం చేస్తామని, అంకితభావంతో పనిచేసే యువ నాయకులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
యువతను రాజకీయంగా చైతన్యవంతులను చేసి గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు.అనంతరం పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు పేరం వెంకటేశ్వర్లు కాలసాని సంజయ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రామనాథం, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ రమేష్,దిశా కమిటీ మండల అధ్యక్షులు మద్దెల సమ్మయ్య, ఉప్పాక ఉప సర్పంచ్ రామ్మోహన్, కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, చిట్టిమల్ల సతీష్ చారి, కొండేరు సంపత్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు