బిజెపి మండల అధ్యక్షుడు గువ్వని నవీన్
నాగర్ కర్నూల్, అక్టోబర్ 24 (ఎస్ బి న్యూస్):తెలంగాణ రాష్ట్రం లో గోరక్ష కుల పై భయ భ్రాంతులకు గురి చేసి దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల బిజేపి ఇన్ అద్యక్షులు గువ్వని నాని ఒక ప్రకటన లో తెలిపారు.
గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న గోరక్షకులపై దాడులు జరగడం అత్యంత దుర్మార్గమని అచ్చంపేట మండల బిజెపి అధ్యక్షుడు గువ్వని నవీన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులకు పాల్పడిన దుండగులను వెంటనే చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని విమర్శించారు. ఇటీవల పోలీసులపై రౌడీషీటర్లు దాడి చేయడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఎంఐఎం ఆగడాలు మితిమీరిపోతున్నాయని, కాంగ్రెస్ పాలనలో గోహంతకుల ఆగడాలు శృతి మించి పోతున్నాయని ఆయన ఆరోపించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొనే ఈ దాడులకు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు.
గోవులను తరలించే వారి సమాచారం అందించినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన ను వ్యక్తం చేశారు, అందుకే గోరక్షకులు స్వయంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నవీన్ వాపోయారు.
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ సోను పై కాల్పులు జరిపిన వ్యక్తి, అతని అనుచరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Social Plugin