గ్రామస్తుల నిరసన కారణమిదే

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని కలుపులోని పల్లి కుమ్మరోనిపల్లి వంగురోనిపల్లి లక్ష్మాపురం బి కే ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీలకు సంబంధించిన ప్రజలం ఈరోజు మా ఐదు గ్రామపంచాయతీలలో జరిగే ఎన్నికలను బహిష్కరించినాం ఈ గ్రామపంచాయతీలలో ఒక్క ఓటరు కూడా ఎస్టీలు లేకపోయినా ప్రభుత్వం ఎస్టీలకు కేటాయించడం విడ్డూరంగా ఉంది ఒక ఎస్టీ లేకపోయినా ఎస్ టి లకు కేటాయించమణి ఏ చట్టం చెప్తుంది 15 సంవత్సరముల నుండి ఎస్టీలు లేకపోయినా చట్టాలను బూసి చూపి ఎస్టీలకు కేటాయిస్తున్నారు ప్రజలకు అనుకూలంగా లేదని రాజ్యాంగాన్ని 100 సార్లు సవరణలు చేసినాము మరి ఈ చట్టాన్ని సవరించలేరా మాకు ఎన్నికలు జరపలేరా మాకు సర్పంచ్ ఎన్నికలు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అభివృద్ధిని నోచుకోవడం లేదు ఎన్నికలు లేకుండా ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది మేము ప్రజాస్వామ్య దేశములోనే ఉన్నామా అనే అనుమానం వస్తుంది పాలకులు వాళ్ళ ఎన్నికలను చూసుకుంటారు కానీ గ్రామపంచాయతీ ఎన్నికల గురించి 15 సంవత్సరాల నుండి ఎందుకు ఆలోచించడం లేదు ప్రభుత్వం గానీ ఎన్నికల కమిషన్ గాని విచారించి వెంటనే ఈ ఐదు గ్రామపంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం ఎస్టీలు ఉంటే ఎస్టీలకు ఇవ్వండి లేనిపక్షంలో ఎస్సీలు ఉంటే ఎస్సీలకు లేదా బీసీలు ఉంటే బీసీలకు ఇవ్వండి ఇంకా ఎన్ని ఏళ్ళు మేము పరిపాలన లేకుండా ఉండాలి మా సమస్యల పరిష్కారం కొరకు న్యాయపోరాటం చేస్తాం వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరిస్తాం మాకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం