న్యూ డెమోక్రసీకి మద్దతు తెలిపిన బిఆర్ఎస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు



*గుండాల మండలం డిసెంబర్ 9 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

 గుండాల గ్రామపంచాయతీ ఎన్నికల సమరంలో న్యూ డెమోక్రసీ పార్టీకి గుండాల మండలం బిఆర్ఎస్ పార్టీ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యూ డెమోక్రసీ సర్పంచ్ అభ్యర్థి కోరం సీతారాములు మాట్లాడుతూ రెండోసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ కి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ప్రచారం చేసి గెలుపు బాగుంట ఎగరవేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసం పాపారావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి టి రాము, సయ్యద్ అజ్జు, పొంబోయిన సుధాకర్, పొంబోయిన హరినాథ్, సుదర్శన్, రమేష్, ఈసం పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.