*గుండాల మండలం డిసెంబర్ 10 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
గుండాల మండలంలో మరో పంచాయతీ ఏకగ్రీవం అయింది మండలం పరిధిలోని దామరతోగు గ్రామపంచాయతీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సర్పంచుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కల్తీ కృష్ణారావు, ఉప సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్తీ సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, వార్డు మెంబర్లుగా కల్తి రవీందర్, మొక్కటి పాపమ్మ, కుంజ వేణు, కొమరం కృష్ణవేణి, కొమరం మహేందర్, రాజం రాకేష్, కొమరం రమేష్ లు ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.
