నిత్యాన్న దాన పథకానికి 30, 000వేళ రూపాయల విరాళం

నిత్యాన్న దాన పథకానికి 30, 000వేళ రూపాయల విరాళం 
నాగర్ కర్నూల్,నవంబర్ 10 (ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధి లోని రంగా పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ శైల క్షేత్రానికి ఉత్తర ముఖ ద్వారంగా స్వయంభూ దేవుడిగా వెలసి అను నిత్యం భక్తులను చల్లగా చూస్తూ వారి కోరికలు నెర వేర్చు 
తున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు విరాళాల లో భాగంగా
నిత్య అన్నదాన కార్యక్రమం కోసం భక్తులు ముందుకు వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తణుకు వాస్తవ్యులు, కలివెల్ల గోత్రానికి చెందిన పి. జానకి దేవి , అరుణ కుమారి ఆలయ నిత్య అన్నదాన కార్యక్రమం కోసం మొత్తం రూ. 30,000 విరాళంగా అదే విధంగా బొంబాయి వాస్తవ్యులు శ్రీ స్వామిసమారత్. మహారాష్ట్ర వాస్తవ్యులు వారి కుటుంబం నుంచి నిత్య అన్నదానమునకు 15 వేలు,మరియు 11వేలరూపాయలు విరాళాన్ని ఆలయ చైర్మన్ కు అందచేశారు. కార్యక్రమంలో పాల్గొన్నారు సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

విరాళాలను ఆలయ పాలకమండలి చైర్మన్ బీరం మాధవ రెడ్డికి ఆలయానికి తమ మద్దతుగా భక్తి శ్రద్ధలతో భక్తులు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం ఆనందకరమని పేర్కొన్నారు.