• రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు పినపాక మండలం ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాలలో నవంబర్ 8, 9, 10వ తేదీల్లో జరుగనున్నాయి.
• ఈ వివరాలను పినపాక ఎంపీ ఓ. వెంకటేశ్వరరావు తెలియజేశారు.
• రాష్ట్రవ్యాప్తంగా పలువురు క్రీడాకారులు హాజరవుతున్న నేపథ్యంలో, ఆదివారం కూడా ఆయన విధుల్లో పాల్గొన్నారు.
• సెక్రటరీలు మరియు 23 గ్రామ పంచాయతీల సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు.
• ఉప్పాక బ్రిడ్జి నుండి ఈ బయ్యారం క్రాస్ రోడ్డు వరకు రహదారి పనులు చేపట్టారు.
• అదేవిధంగా ఈ బయ్యారం క్రాస్ రోడ్ నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు రహదారి మార్జిన్ విస్తరణ పనులు సాగాయి.
• మొత్తం సుమారు 5 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
• క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
• ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీలు, కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, కంది సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Social Plugin