అయితే నెలలు గడిచినా వాగ్దానం చేసిన లాభాలు రాకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఇదే సమయంలో “నన్నే డబ్బులు అడుగుతారా? మీ సంగతి చెబుతా” అంటూ ఆమె బెదిరించిందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
ఫిర్యాదులపై స్పందించిన హయత్‌నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు మరింత అప్రమత్తత అవసరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Social Plugin