- ఏకగ్రీవమైన సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే పాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో కిష్టాపురం, పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం కావడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంది సుబ్బారెడ్డిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కిష్టాపురం సర్పంచ్ కారం పాపారావు, పాత రెడ్డిపాలెం సర్పంచ్ సాగబోయిన నాగ కుమారి ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరు సర్పంచులను శాలువాతో ఎమ్మెల్యే పాయం సత్కరించారు. ఇద్దరు సర్పంచులు ఏకగ్రీవం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన కంది సుబ్బారెడ్డిని సైతం శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ సర్పంచ్ పదవిని బాధ్యతగా స్వీకరించాలని, పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సర్పంచులను ఏకగ్రీవం చేసిన ప్రజలకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Social Plugin