టిఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీపై అసభ్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం ఆరోపించారు. ఆదివారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మూడు గ్రామపంచాయతీ సర్పంచులు ఏకగ్రీవం చేసుకున్నామని, అదే విజయ డంకా మోగించి 20 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు మీ కంటికి కనిపించడం లేదా అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. దళిత బంధు, బీసీ బందు పేరుతో మీరు తీసుకున్న ముడుపులు మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. ఆ బందులో మీరు చేసిన అవినీతి నే మీ పార్టీని బొంద పెట్టిందని తెలిపారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయాలని కోరారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని 11వ తేదీన అది ప్రజలే నిరూపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉడుం లక్ష్మిరెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గొంది రాదా, చీకటి సత్యం, కాంతారావు, ఎట్టి సర్వేశ్వరరావు, వీరాస్వామి, టిడిపి మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు , తదితరులు పాల్గొన్నారు.
Social Plugin