ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి


- మద్యం డబ్బుకు విలువైన ఓటును అమ్ముకోవద్దు 
- పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్స
- ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ సురేష్ 

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పార్టీ నాయకులు ప్రజలు సహకరించాలని ఈ బయ్యారం ఎస్సై సురేష్ కోరారు. ఆదివారం పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ కొత్త గుంపు గ్రామంలో గ్రామస్తులతో ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. ఆ ఓటు హక్కును డబ్బు మధ్యానికి అమ్ముకోవద్దని సూచించారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ అనవసరంగా గొడవలకు వెళ్ళవద్దని సూచించారు. గొడవలకు పాల్పడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు