- జిల్లా ఎన్నికల సహాయ అధికారి సంకీర్త్
పినపాక మండలంలో 24 పోలింగ్ కేంద్రాలలో 174 బూతులలో ఈనెల 11వ తేదీన ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల సహాయ అధికారి సంకీర్త్ తెలియజేశారు. ఆదివారం ఆయన పినపాక మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ 28 వార్డు ఏకగ్రీవం ఆగినట్లుగా ఆయన తెలియజేశారు. 202 బూతులలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏకగ్రీవం అయిన కేంద్రాలు తీసివేయగా 174 కేంద్రాల్లో ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి ఈ మధ్యాహ్న ఒంటిగంట వరకు ఎన్నిక జరుగుతుందని ఈ లోగానే ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటర్స్ స్లిప్పులు ఇప్పటికే పంపిణీ చేశామని, అందరివారు మీ దగ్గర ఉన్న గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి ఓటర్ లిస్టులో చెక్ చేయించుకుని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
Social Plugin