నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ తన నిజాయితీని చాటుకున్నారు. ఆదివారం పినపాక మండలం జానంపేటలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయనకు రహదారిపై 5600 రూపాయల నగదు దొరికాయి. ఆ నగదు పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి , ఆ నగదు కోసం వెతుకుతున్న లారీ డ్రైవర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు అభినందించారు. ఆయన నిజాయితీని పలువురు కొనియాడారు.