- హోరాహోరీగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రచారం
పినపాక మండల వ్యాప్తంగా 20 గ్రామపంచాయతీలలో హోరా హోరీగా ప్రచారం కొనసాగుతూ ఉంది. నువ్వా నేనా అంటూ పోటీపడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒకవైపు, టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒకవైపు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామీణ ప్రాంతం కావడంతో పనిచేసే ప్రదేశాల వద్దకు వెళ్లి సైతం నాయకులు పోటాపోటీగా ప్రచార నిర్వహిస్తున్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ బిఆర్ఎస్ నాయకులు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రచార నిర్వహిస్తున్నారు. 11వ తేదీన 20 గ్రామ పంచాయతీల భవిష్యత్తు తేలనుంది.
Social Plugin