గ్రామ స్వరాజ్య సమస్త ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ

గుండాల మండలం డిసెంబర్ 6 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:గ్రామ స్వరాజ్య సమస్త ఆధ్వర్యంలో సబ్సిడీపై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం స్థానికంగా శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్ దుష్యంత్ కుమార్ ప్రధాన అతిథిగా హాజరై సుమారు 30 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జలాల్, ఎం.ఈ.ఓ పార్వతమ్మ పాల్గొని, విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భం గా దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రయాణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని సబ్సిడీపై సైకిళ్లను అందిస్తున్నామని తెలిపారు. మొదటి విడతకు మంచి స్పందన రావడంతో, దరఖాస్తు చేసే విద్యార్థులకు రెండో విడతలో మరో 30 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు.

గ్రామాల్లో విద్య, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.