నాగర్ కర్నూల్,నవంబర్ 06,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధి లోని రంగా పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్వయంభూ దేవుడిగా నల్ల మల కొండల లో వెలిసి భక్తుల కోరికలను తీరుస్తూ శ్రీశైలానికి ఉత్తర ముఖ ద్వారంగా వెలసి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానఅభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన అరవపల్లి లక్ష్మీ నరసింహం, వారి కుటుంబ సభ్యులు శనివారం ₹1,12,000లను నగదు రూపం లో విరాళంగాఅందజేశారు. ఈవిరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ బీరం. మాధవ రెడ్డికి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా అందించారు.
విరాళం అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేకంగా గణపతి పూజ,కుంకుమార్చన, అభిషేకం నిర్వహించి వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందజేశారు. తదుపరి వారికి స్వామివారి శేష వస్త్రంతో ఘన సన్మానం చేశారు. ఇలాగే ఆలయ అభివృద్ధి లో భాగంగా సహాయం చేస్తున్న ప్రతి భక్తుని కుటుంబ సభ్యుల పై స్వామి వారి కృప ఉండాలని వారిని అష్ట ఐశ్వర్యాల తో సుఖ సంతోషాలతో ఆయు రారోగ్యా లతో దీవించాలని అభివృద్ధి లో భాగమైన భక్తుల కోరికలు నెరవేరేలా ఆ ఉమామహేశ్వరుని దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఛైర్మన్ మాధవ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Social Plugin