- మల్లారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చందా ప్రసాద్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్న మంత్రి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం పినపాక మండలంలో పర్యటించనున్నారు. మల్లారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చందా వరప్రసాద్ గెలుపుకోసం ఆమె ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. గ్రామంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని లక్ష్యంగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంటింటి ప్రచారంతో పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. చందా వరప్రసాద్ అభ్యర్థిత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో, సీతక్క పర్యటన మరింత ఉత్సాహాన్ని నింపనుందని నాయకులు తెలిపారు. పార్టీ గెలుపుకోసం కీలకమైన ఈ ప్రచారంలో గ్రామస్థులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Social Plugin