జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధం చేయాలి : డిపిఓ


- కబడ్డీ క్రీడల గ్రౌండ్ పరిశీలన 
- ఆవరణ చుట్టూ ప్లాంటేషన్ ఉండేలా చూడాలి 
- క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఉండాలి 
- క్రీడాకారుల వసతి పై ప్రత్యేక దృష్టి సారించాలి 
- ఈ క్రీడలు జిల్లాలోనే నెంబర్ వన్ గా నిలవాలి
 - డిపిఓ రాంబాబు 

పినపాక

జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు, వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రౌండ్ ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం గురువారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారం గ్రామపంచాయతీలో జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు ఈ పాఠశాల గ్రౌండ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ పాఠశాల పరిసర ప్రాంతాలను ఆయన డిఎల్పిఓ సుధీర్ కుమార్ తో కలిసి పరిశీలించారు. నవంబర్ 8 9 10వ తేదీలలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు పాఠశాలలో వసతులను ఎంఈఓ నాగయ్య, ఇన్చార్జ్ హెడ్మాస్టర్ తిరుపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జాతీయస్థాయి క్రీడలు ఏడుల బయ్యారంలో జరుగుతున్నాయని వేలాదిమంది వీక్షకులు హాజరవుతారని, అలాగే వందలాది మంది క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వస్తారని కావున ఇక్కడ జరిగే క్రీడలు రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఉండాలని సూచించారు. పాఠశాల గ్రౌండ్ చుట్టూ ప్లాంటేషన్, అలాగే ఈ బయ్యారం క్రాస్ రోడ్డు నుండి పాఠశాల వరకు మొక్కలు నాటాలని సూచించారు.

 పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు. అనంతరం స్థానిక ఎంపీ ఓ వెంకటేశ్వరరావును అడిగి పూర్తిస్థాయిల వివరాలు తెలుసుకున్నారు. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వాష్ రూమ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల గ్రౌండ్ మొత్తం తిరుగుతూ గ్రౌండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పాఠశాల పూర్వ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఇక్కడ జరిగే క్రీడలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సెక్రటరీలు జైపాల్ రెడ్డి, అశోక్, స్థానిక పెద్దలు, పూర్వ విద్యార్థులు కంది సుబ్బారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీరామ్ బృహస్పతి, పిడి వీరన్న, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.