పినపాక, జూలై 4 (ఎస్‌బీ న్యూస్): కాంగ్రెస్ పార్టీ పినపాక మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పేరం వెంకటేశ్వర్లుకు పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కన్వీనర్ ఎండీ బషీరుద్దీన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పినపాక మండలం ఈ బయ్యారంలో ఆయన మాట్లాడుతూ
పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని అయన సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేందుకు సమష్టిగా కృషి చేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని పేరం వెంకటేశ్వర్లుకు ఎండీ బషీరుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
0 కామెంట్‌లు