పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పేరం వెంకటేశ్వరరావుకు ఘన సన్మానం

పినపాక, జూలై 4 (ఎస్‌బీ న్యూస్): పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పేరం వెంకటేశ్వరరావును వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ సుతారి సింధుజ, ఉప సర్పంచ్ మాటూరి రవీంద్ర గ్రామస్థులు మర్యాదపూర్వకంగా పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ సింధుజ  మాట్లాడుతూ, పార్టీ పట్ల నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన పేరం వెంకటేశ్వరరావుకు మండల అధ్యక్ష బాధ్యతలు దక్కడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పినపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు చేరువై సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ అభివృద్ధి, మండల సంక్షేమానికి ఆయన మరింత కృషి చేయాలన్నారు.నూతన బాధ్యతల్లో విజయాలు సాధించాలని వెంకట్రావుపేట గ్రామ ప్రజల తరఫున వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరావుపేట యువత పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు