ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్, శ్రీ మహాలక్ష్మి మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి నిపుణుల పర్యవేక్షణలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. అచ్చంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ సభ్యులు, నిర్వాహకులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు