ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ


ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని  అన్ని నియోజకవర్గాలు, 20 మండలాల్లో ప్రత్యేక సవరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వారు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయ్యిందని, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ముఖ్యంగా BLA-2లు, BLOలతో సమన్వయం చేసుకుని ఈ నెల 24వ తేదీ లోపు ఓటర్ల నుంచి ఫారాలను పూర్తిగా నింపించి సంతకాలు తీసుకుని BLOలకు అందజేసి రశీదు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మీనాక్షీ నటరాజన్, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు అయ్యేలా చూడాలని, ఏ ఒక్క ఓటరు పేరు కూడా మిస్ కాకుండా అందరూ కొత్తగా దరఖాస్తు ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు