ఐఐటీ బాసరలో సీటు సాధించిన విద్యార్థినికి రూ.18 వేల ఆర్థిక సాయం

ఐఐటీ బాసరలో సీటు సాధించిన విద్యార్థినికి రూ.18 వేల ఆర్థిక సాయం
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన విద్యార్థిని ఆర్. కావ్యశ్రీ ఐఐటీ బాసరలో సీటు సాధించి ప్రతిభ చాటింది. విద్యార్థినికి 600 మార్కులకు గాను లో 562 మార్కులు సాధించింది. కావ్యశ్రీ తల్లిదండ్రులు అచ్చంపేటలోని ఓ టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు అంగరేకుల బిక్షపతి ఆధ్వర్యంలోని క్లబ్ కార్యవర్గం విద్యార్థినిని శాలువాతో సత్కరించి రూ.18,000 ఆర్థిక సహాయం అందించింది. ఈ సందర్భంగా ఆమె ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని సభ్యులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కందికొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మన్ను పటేల్, కోశాధికారి పోకల ప్రవీణ్, వై. శ్రీనివాసులు, కేతపల్లి వెంకటేష్, దశరథం, కటకం ప్రకాష్, పోలా శీను, ఆంజనేయులు, వెంకటేష్, రమేష్, రవి, శివ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు