ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే పాయం పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం కమిటీ చైర్మన్‌గా పూర్తి బాధ్యతతో పనిచేస్తానని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానన్నారు . ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలందిస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు SB న్యూస్ కు తెలిపారు .
0 కామెంట్‌లు