ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఎం నాయకులు.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
ఆదోనిలో ఇందిరమ్మ ఫేజ్-3 లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం నాయకులు, లబ్ధిదారులు ఎమ్మార్వో కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. సమస్యకు ఈరోజే పరిష్కారం చూపాలని, తేలే వరకు కార్యాలయం నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీంతో ఎమ్మార్వో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈరన్న మాట్లాడుతూ, 2004లో తాను 16వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో లబ్ధిదారుల నుంచి రూ.2,100 చొప్పున వసూలు చేశారని, అయితే ఇప్పటివరకు వారికి ఇంటి స్థలాలు కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
#SBNews #Adoni #CPM #IndirammaPhase3 #MROOffice #Protest #HouseSites #Beneficiaries #BreakingNews #TeluguNews #AndhraPradesh #LocalNews #CPMProtest #NewsUpdate
0 కామెంట్‌లు