ఫైళ్లు పెండింగ్‌లో పెడితే సహించం: మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందిపోయి ఫైళ్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం సరికాదని అయన హెచ్చరించారు.ముక్కిడిగుండం, సోమశిల, రామాపురం, ఎల్లూరు, జటప్రోలు తదితర ప్రాంతాలకు సంబంధించిన పోడు పట్టాలు, భూ వివాదాలు, సర్వేలు, పట్టాదారు హక్కులు, భూభారతి, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 16 అంశాలపై సమగ్రంగా మంత్రి సమీక్షించారు. అర్జిదారులను నేరుగా పిలిపించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే సమస్యలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.డివిజన్ స్థాయిలో పరిష్కరించగల ఫైల్ ఒక్కటి కూడా పెండింగ్‌లో ఉండకూడదని, కలెక్టర్ స్థాయి అంశాలను పూర్తి నివేదికలతో వెంటనే పంపాలని సూచించారు. ప్రతి ఫైల్‌కు గడువుతో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రజలు మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
#SBNews #Telangana #Kollapur #JupallyKrishnaRao #RevenueDepartment #ForestDepartment #PendingFiles #LandIssues #Government #BreakingNews #TeluguNews #LocalNews #RevenueReview #Administration #NewsUpdate
0 కామెంట్‌లు