మృతుని కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్ వేనేపల్లి గణేష్ రావు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రానికి చెందిన నారమోని పర్వతాలు (65) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, వంగూరు మండల బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు వేనేపల్లి గణేష్ రావు, మాజీ సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లాగౌడ్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని వారికీ భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బండపల్లి జంగయ్య, ఉప సర్పంచ్ బండపల్లి భాస్కర్, వార్డు సభ్యులు సుమన్, అక్కి మురళి, నారమోని జంగయ్య, బండపల్లి శివకుమార్, లట్టుపల్లి మురళి, లట్టుపల్లి నిరంజన్, రాఘవేందర్ గౌడ్, పిట్టల మల్లేష్, దామోదర్, భాషమోని కృష్ణ, బండపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
#SBNews #BreakingNews #Telangana #Nagarkurnool #Achampet #Vangoor #BRS #VenepalliGaneshRao #FinancialAssistance #Condolences #TeluguNews #LocalNews #PoliticalNews #CommunitySupport #NewsUpdate
0 కామెంట్‌లు