300 మందికి ఉచిత శస్త్రచికిత్సలు.. విజయవంతంగా ముగిసిన నాల్గవ విడత మెగా సర్జికల్ క్యాంపు

విజయవంతంగా ముగిసిన నాల్గవ విడత మెగా సర్జికల్ క్యాంపు
అచ్చంపేట: అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన నాల్గవ విడత మెగా సర్జికల్ క్యాంపు విజయవంతంగా సోమవారం ముగిసింది. ఈ క్యాంపు ద్వారా ఇప్పటివరకు 300 మంది రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వాతంత్ర్య భారత్ దినపత్రికకు  తెలిపారు.
ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న మిగిలిన రోగుల కోసం త్వరలో మరో ప్రత్యేక మెగా సర్జికల్ క్యాంపును నిర్వహించి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తామని ఆయన వెల్లడించారు. అచ్చంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరాన్ని పెద్దఎత్తున వినియోగించుకుని నాణ్యమైన వైద్య సేవలు పొందారన్నారు.అచ్చంపేట నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అలాగే అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి త్వరలోనే అన్ని ఆధునిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ తారాసింగ్, డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, ప్రతీప్ రాజ్, బాల్ సింగ్, మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
#Achampet #AchampetMLA #DrChikkuduVamsiKrishna #MegaSurgicalCamp #FreeSurgeries #Healthcare #PublicHealth #AreaHospital #MedicalCamp #QualityHealthcare #Telangana #Nagarkurnool #HealthForAll #FreeMedicalServices #PatientCare #HospitalDevelopment #TeluguNews #HealthNews #SBNews  #sbnews 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు