మణుగూరు: ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో మణుగూరు ఆధ్వర్యంలో కుక్కలు, పిల్లులకు ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పశువైద్య అధికారిణి డా. సరస్వతి మాట్లాడుతూ జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధులు, ముఖ్యంగా రేబిస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. పెంపుడు కుక్కలు, పిల్లులకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా యాంటీ రేబిస్ టీకాలు వేయించడం ద్వారా రేబిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని సమితిసింగారం గ్రామ సర్పంచ్ మాధవరావు, ఉపసర్పంచ్ గండ్ల సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ టీకాల శిబిరంలో మొత్తం 16 కుక్కలు, ఒక పిల్లికి యాంటీ రేబిస్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పి. వీరభద్రం, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.#Manuguru #BhadradriKothagudem #WorldZoonosesDay #AntiRabies #RabiesAwareness #VeterinaryDepartment #PetVaccination #AnimalHealth #TelanganaNews #SBNews #TeluguNews #PublicHealth #DogVaccination #CatVaccination #ZoonoticDiseases #FreeVaccination #PVCManuguru #SamithiSingaram #AwarenessProgram #NewsUpdate
0 కామెంట్‌లు